నీ మాయ వల్లో [Into the Unknown] [Nee maaya val lo] [Transliteration]
Songs
2025-05-21 16:00:33
నీ మాయ వల్లో [Into the Unknown] [Nee maaya val lo] [Transliteration]
నీ మాయ వల్లో, నీ మాయ వల్లో
నీ మాయ వల్లో
వినబడినా వినను
ఏ కలకలం కోరనులే
పిలిచే పిలుపేది నను కదపదు లే
పరుగే తీసేస్తూ మరి రాను వెనకే
నీ స్వరమే. పెట్టానులే పెడచెవినే
కాదని విన్నా అది జరగదు ఏ భయమూ లేదు
నన్ను కోరే మనుషులంతా ఇచటే గలరు
రహస్యమంటు చెప్పినా నే పలకనుగా
చేశా సాహసాలు ఇంకేదీ వద్దులే
నష్టమెంత జరగనుందో నేను పడనులే
నీ మాయ వల్లో, నీ మాయ వల్లో
నీ మాయ వల్లో
దేనికిలా? నిదురలు చెరుపునది
పొరబాటు చేసానా నమ్మి ఇటు కదిలి?
లేదంటే నువ్వు, కొంచెం నాలా ఉంటావా?
నాదే కాదా? నివసించే ఈ చోటే
దిగులే మొదలయ్యే నా శక్తే పెరిగే
వేరే దారి చూడలేక చేరానా
నీ మాయ వల్లో, నీ మాయ వల్లో
నీ మాయ వల్లో
నువ్వున్నావా? చూస్తున్నావా?
నిన్ను చేరా, వింటున్నావా?
ఎటు వెళ్తున్నావు? నన్నే వదిలేసి
నేనెల్లా పడ్డానో నీ మాయ వల్లో
- Artist:Nakul Abhyankar