ఝుమ్మని ఝుమ్మని ఆడే [Ghoomar] [Jhoommani Jhoommani Aade]

Songs   2024-11-19 10:31:10

ఝుమ్మని ఝుమ్మని ఆడే [Ghoomar] [Jhoommani Jhoommani Aade]

జయము జయము మా రాణికి

స్వాగతమే అనరా

కోమల సుకుమారి నాట్య మయూరి రా

రావమ్మ రావె నాట్యములాడగ రావె

వయ్యారిలా నాట్యములాడగ రా

ఓయమ్మ నువ్వు కులికి కులికి ఇటు రా

లాస్య నటలహరి వలె రెచ్చిపోవే

ఓ సఖి రావే మదిలో నీవే

రాణి రమణి సుగుణమని నీవె చమకుమని సాగే

భవిని సాగే మానసమోగే

ఝణకు ఝణకు గజ్జలు మోగె

మగువా నాట్యములాడగ రావె

మనసా నాట్యములాడగ రావె

కలికి ఆశలే తలపై మోసుకుని

ఝూమ్మని ఝూమ్మని ఆడే

హా ఝూమ్మని ఝూమ్మని ఆడే

ఓ కలత నేర్పు కసి జగతి వీడి ఇక

ఝూమ్మని ఝూమ్మని ఆడే మనసే

కులాసాల ఆట సాగెను

ఝూమ్మని ఝూమ్మని ఝూమ్మని ఝూమ్మని ఆడేలే

ఝూమ్మని ఝూమ్మని ఝూమ్మని మనసే ఝూమ్మని ఆడేలే

ఓ తీగ లాగా ఊగె నేనే కాంతి తానే ఛాయా నేనే

మనసులోన జావళీలే జనాపదమై మేళం పలికే

కులాసాల ఆట సాగెను

ఝూమ్మని ఝూమ్మని ఝూమ్మని ఝూమ్మని ఆడేలే

ఝూమ్మని ఝూమ్మని ఝూమ్మని మనసే ఝూమ్మని ఆడేలే

హే రాజా శ్రీ మహా తేజస్వీ

నాలో వెలిగే దీపాలే ఇవి నువ్వాడే రంగేళి

మది మహల్లో తేజవిల్లాయి ప్రేమే రంగవల్లులాయే

నాలో వెలిగే దీపాలే ఇవి నువ్వాడే రంగేళి

మది మహల్లో తేజవిల్లాయి ప్రేమే రంగవల్లులాయే

నాతో నువ్వే రాగ ప్రణయ జగమే కాగ

తార తీరా మాయను నాలో మోగె తారా రాత్రులిపుడే

కులాసాల ఆట సాగెను

ఝూమ్మని ఝూమ్మని ఝూమ్మని ఝూమ్మని ఆడేలే

ఝూమ్మని ఝూమ్మని ఝూమ్మని మనసే ఝూమ్మని ఆడేలే

కలికి ఆశలే తలపై మోసుకుని

ఝూమ్మని ఝూమ్మని ఆడే

కలత నేర్పు కసి జగతి వీడి ఇక

ఝూమ్మని ఝూమ్మని ఆడే మనసే

కులాసాల ఆట సాగెను

ఝూమ్మని ఝూమ్మని ఝూమ్మని ఝూమ్మని ఆడేలే

ఝూమ్మని ఝూమ్మని ఝూమ్మని మనసే ఝూమ్మని ఆడేలే

రావమ్మ రావమ్మ నాట్యం ఆడి పోవే

ఇపుడే ఆడి పాడే నువ్వే చెలరేగిపోవే

ఆ లంగా ఓణి, చీర నువ్వు కట్టేసుకోవే

ఓ ఝూమ్మని ఝూమ్మని ఝూమ్మని ఝూమ్మని చిందేసి పోవే

కోడళ్ళు అత్తయ్యలాడే వదినలు ఝూమ్మని ఆడే

అక్కలు చెల్లెళ్ళు ఆడే మరదళ్ళు గజ్జెలు ఆడే

ఝూమ్మని ఝూమ్మని ముద్దుగుమ్మలంతా ఆడే

గిరా గిరా గిరా గిరా గుమ్మలు నాట్యాలాడేలే

ఝూమ్మని ఝూమ్మని ముద్దుగుమ్మలంతా ఆడే

గిరా గిరా గిరా గిరా గుమ్మలు నాట్యాలాడేలే

గుమ్మ గుమ్మ గుమ్మ గుమ్మ గుమ్మలు గుమ్మని ఆడేలే

గిరా గిరా గిరా గిరా గుమ్మలు నాట్యాలాడేలే

గుమ్మ గుమ్మ గుమ్మ గుమ్మ గుమ్మలు గుమ్మని ఆడేలే

గిరా గిరా గిరా గిరా గుమ్మలు నాట్యాలాడేలే

Padmaavat (OST) [2018] more
  • country:India
  • Languages:Hindi, Tamil, Telugu, Other
  • Genre:Soundtrack
  • Official site:
  • Wiki:https://en.wikipedia.org/wiki/Padmaavat
Padmaavat (OST) [2018] Lyrics more
Excellent Songs recommendation
Popular Songs
Artists
Songs